ట్రైలర్‌ చూసి నచ్చితేనే సినిమా చూడండి: అభినవ్ గోమతం

ట్రైలర్‌ చూసి నచ్చితేనే సినిమా చూడండి: అభినవ్ గోమతం

కమెడియన్‌‌‌‌గా ఆకట్టుకున్న అభిన‌‌‌‌వ్ గోమ‌‌‌‌ఠం హీరోగా నటించిన చిత్రం ‘మ‌‌‌‌స్తు షేడ్స్ ఉన్నయ్ రా’. వైశాలి రాజ్ హీరోయిన్‌‌‌‌.  తిరుప‌‌‌‌తి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి నిర్మించారు. ఈనెల 23న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ‌‌‌‌రైన వ‌‌‌‌రుణ్‌‌‌‌తేజ్ మాట్లాడుతూ ‘కంటెంట్‌‌‌‌ను న‌‌‌‌మ్మి తీసిన సినిమా ఇది. లవ్, ఫ్రెండ్‌‌‌‌షిప్‌‌‌‌, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌.

అభిన‌‌‌‌వ్‌‌‌‌లో న‌‌‌‌ట‌‌‌‌న ప‌‌‌‌రంగా మంచి షేడ్స్ ఉన్నాయి. అలాగే సినిమాలో మస్త్ ఎమోషన్స్‌‌‌‌ ఉన్నాయి. ఈ చిత్రంతో టీమ్ అందరికీ బ్రేక్ రావాలని ఆశిస్తున్నా’ అన్నాడు. అభిన‌‌‌‌వ్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌‌‌‌లో ఇది ఎంతో స్పెష‌‌‌‌ల్‌‌‌‌.  క‌‌‌‌థ  నచ్చి ఈ సినిమా చేశా.  దీనికోసం నా కెరీర్‌‌‌‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ట్రైలర్‌‌‌‌‌‌‌‌తో సహా మా కంటెంట్‌‌‌‌ చూసి నచ్చితేనే సినిమా చూడండి. తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’ అన్నాడు. సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ దర్శకుడు థ్యాంక్స్ చెప్పాడు. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉన్న సినిమా ఇదని నిర్మాతలు తెలియజేశారు. అలీ రైజా, రాధామోహ‌‌‌‌న్‌‌‌‌, కార్తికేయ‌‌‌‌, మెహిన్‌‌‌‌, సంజీవ్‌‌‌‌, లావ‌‌‌‌ణ్య తదితరులు పాల్గొన్నారు.