OTTలో అవార్డు విన్నింగ్ మట్టి కథ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

OTTలో అవార్డు విన్నింగ్ మట్టి కథ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

వైవిధ్య‌మైన క‌థాంశంతో వచ్చి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రం మట్టి కథ (Matti Katha). రూరల్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను ప‌వ‌న్ క‌డియాల(Pawan kadiyala) తెరకెక్కించారు. పెల్లెటూరు, అక్కడి మనుషులు, మట్టితో వారికి ఉండే అనుబంధం వంటి అంశాలను చాలా సహజంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు.

Also Read : నీతో ఉన్న ప్రతీ క్షణం ఓ అద్భుతం.. రకుల్ బాయ్ఫ్రెండ్ స్పెషల్ పోస్ట్

అందుకే ఈ మూవీ ఇండో ఫ్రెంచ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్‌లో ఏకంగా 9 అవార్డుల‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. మట్టికథ సినిమా అక్టోబర్ 13 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాటుఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్స్ లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ రానుంది అనేది చూడాలి.