FIFA Golden Boot: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌లు ముగియడంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ బూట్ (Golden Boot) రేస్ ఊహించని మలుపులు తిరుగుతోంది. జూన్ 30న ఈక్వెడార్‌పై మెక్సికో 2–0తేడాతో గెలిచిన మ్యాచ్ తర్వాత అఫీషియల్ లీడర్‌బోర్డ్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబార్పే, నార్వే పవర్‌హౌస్ ఎర్లింగ్ హాలాండ్‌లు నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుత గోల్స్ బాదడంతో అగ్రస్థానాల్లో పెను మార్పులు జరిగాయి.
మెస్సీ రికార్డ్‌ను టచ్ చేసిన ఎంబార్పే:
న్యూజెర్సీ వేదికగా స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3–0తో ఘన విజయం సాధించగా.. అందులో కిలియన్ ఎంబార్పే రెండు గోల్స్‌తో దుమ్మురేపాడు. ఈ రెండు గోల్స్‌తో కలిపి ప్రస్తుత టోర్నీలో ఎంబార్పే మొత్తం గోల్స్ సంఖ్య 6కి చేరుకుంది. దీంతో అతను అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ (6 గోల్స్) సరసన అగ్రస్థానంలో నిలిచాడు. ఫిఫా రూల్స్ ప్రకారం సమానంగా గోల్స్ ఉన్నప్పుడు అసిస్ట్‌లు టై-బ్రేకర్ కింద పరిగణిస్తారు. మెస్సీ ఇప్పటి వరకు ఒక్క అసిస్ట్ కూడా నమోదు చేయకపోగా, ఎంబార్పే ఖాతాలో 2 అసిస్ట్‌లు ఉన్నాయి. ఈ కారణంగానే ఎంబార్పే ప్రస్తుతం అధికారికంగా గోల్డెన్ బూట్ రేస్‌లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.
రెండో స్థానానికి ఎర్లింగ్ హాలాండ్:
మరోవైపు, నార్వే ఫుట్ బాల్ ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్ తన ఆటతీరుతో ఒంటిచేత్తో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఐవరీ కోస్ట్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో 86వ నిమిషంలో హాలాండ్ కొట్టిన విన్నింగ్ గోల్ నార్వేను 2–1తేడాతో గెలిచింది. ఈ వరల్డ్ కప్‌లో హాలాండ్‌కు ఇది 5వ గోల్ కావడం విశేషం.. ఈ కీలక గోల్‌తో మిగిలిన ప్లేయర్లందరినీ వెనక్కి నెట్టి, అతను రేస్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే ఫ్రాన్స్‌కు చెందిన ఉస్మానే డెంబెలే (4 గోల్స్), బ్రెజిల్ స్టార్ వినీషియస్ జూనియర్ (4 గోల్స్) కూడా ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాబోయే మ్యాచ్‌ల్లో కేప్ వర్డేతో అర్జెంటీనా తలపడనుండటంతో, మెస్సీ మళ్లీ లీడ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
టాప్-5 గోల్డెన్ బూట్ రేసులో ప్లేయర్స్:
* కిలియన్ ఎంబార్పే (ఫ్రాన్స్, 6 గోల్స్, 2 అసిస్ట్‌లు)
* లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా, 6 గోల్స్, అసిస్ట్‌లు ఏమీ లేవు)
* ఎర్లింగ్ హాలాండ్ ( నార్వే, 5 గోల్స్, అసిస్ట్‌లు ఏమీ లేవు)
* ఉస్మానే డెంబెలే (ఫ్రాన్స్, 4 గోల్స్, 2 అసిస్ట్‌లు)
* వినీషియస్ జూనియర్( బ్రెజిల్, 4 గోల్స్, అసిస్ట్‌లు ఒకటి)
