ఈస్ట్ రూథర్‌ఫోర్డ్: వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. స్టార్ స్ట్రయికర్ కైలియన్ ఎంబాపే (66, 90+6వ ని) రెండు గోల్స్‌తో చెలరేగడంతో.. గ్రూప్–ఐ లీగ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3–1తో సెనెగల్‌ను ఓడించింది. బ్రాడ్లీ బార్కోలా (82వ ని) ఫ్రాన్స్‌కు మరో గోల్ అందించాడు. ఇబ్రహీం ఎంబాయే (90+5వ ని) సెనెగల్ తరఫున ఏకైక గోల్ చేశాడు.
తొలి హాఫ్‌లో నిరుత్సాహపరిచిన ఫ్రెంచ్ జట్టుకు ఎంబాపే రాకతో జోరందుకుంది. సెనెగల్ ప్లేయర్ నికోలస్ జాక్సన్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు తాకి వెనక్కి రావడంతో ఫ్రాన్స్ ప్రమాదం నుంచి బయటపడింది. సెకండాఫ్‌లో మైకేల్ ఒలిసే అందించిన పాస్ ఎంబాపే మెరుపు వేగంతో గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఆ తర్వాత బ్రాడ్లీ ఆధిక్యాన్ని పెంచాడు.
ఇంజ్యురీ టైమ్‌లో ఎంబాయే గోల్ కొట్టగా, ఒక్క నిమిషం వ్యవధిలోనే ఎంబాపే 30 గజాల దూరం నుంచి కొట్టిన షాట్ నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకుపోయింది. దాంతో ఫ్రాన్స్ విజయం ఖరారైంది. ఫ్రాన్స్ తరఫున అత్యధిక ఇంటర్నేషనల్ గోల్స్ (58) చేసి ప్లేయర్‌గా ఒలివియర్ జిరూ రికార్డును ఎంబాపే బ్రేక్ చేశాడు.
