రష్యాలో అదుపు తప్పిన మెషీన్ గన్.. గాల్లోకి ఆటోమేటిక్ ఫైరింగ్.. సైనికుడు ఎలా ఎగిరిపడ్డాడో చూడండి..?

రష్యాలో అదుపు తప్పిన మెషీన్ గన్.. గాల్లోకి ఆటోమేటిక్ ఫైరింగ్.. సైనికుడు ఎలా ఎగిరిపడ్డాడో చూడండి..?

మెషీన్ గన్ ఎంత పవర్ ఫుల్లో సినిమాల్లో చూసుంటారు. ఒక్కసారి ట్రిగ్గర్ పై వేలు పెడితే.. నిమిషాల్లో వేల రౌండ్ల కాల్పులు జరుపుతుంటుంది. దాని ఫైరింగ్ అనుకూలంగా భుజం సపోర్ట్ తీసుకుని.. వెనక్కు తన్నే దాని శక్తిని భుజంతో ఆపుతూ.. గన్ తో పాటే వైబ్రేట్ అవుతూ ఉన్న సీన్స్ చాలా చూశాం. అయితే దాని హ్యాండ్లింగ్ లో తేడా వస్తే మాత్రం అది సృష్టించే బీభత్సానికి దాన్ని ఫైర్ చేస్తున్నవాళ్లే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. 

అలాంటి భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  హెలికాప్టర్, యుద్ధ విమానాల నుంచి  కాల్చడానికి రూపొందించిన రోటరీ మెషీన్ గన్ ను.. భూమిపై వాడకానికి అనువుగా మార్చి ఫైరింగ్ జరిగే క్రమంలో.. దానిపై కంట్రోల్ కోల్పోయి  ఒక రష్యన్ సైనికుడు క్షణాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్న వీడియో అది. 

 సోవియట్ యూనియన్ కాలంలో రూపొందించిన  Mi-24 అనే మెషీన్ గన్.. హెలికాప్టర్ ముందు భాగంలోని టరెట్ ప్లాట్‌ఫామ్‌కు ద్వారా సైనికులు శత్రువులపై కాల్పులు జరిపేందుకు వినియోగిస్తారు. అయితే ఆ గన్ ను ఒక గ్రౌండ్ లో వినియోగిస్తున్న క్రమంలో ఊహించని ప్రమాదం జరిగింది. భూమిపై ఒక మౌంట్‌కు బోల్టులతో బిగించిన నాలుగు బ్యారెళ్ల యాక్ బి-12.7 గన్ ను ఒక రష్యన్ సైనికుడు పేల్చడానికి  సిద్ధమవుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. 

ట్రిగ్గర్ లాగిన కొన్ని క్షణాల తర్వాత, ఆ గన్ బోల్టుల నుంచి ఊడిపోయి, ఆటోమేటిక్ ఫైర్ జరిగినట్లుగా కనిపించింది. సైనికుడు చేతి నుంచి పట్టుకోల్పోవడంతో.. చుట్టూ తిరుగుతూ కొన్ని రౌండ్స్ కాల్పులు జరిపింది. దాన్ని పట్టి వేళాడుతూ ఎట్టకేలకు కిందికి దూకేస్తాడు ఆ సైనికుడు. అక్కడున్న మిగతా సైనికులు ప్రాణ భయంతో నేలకు కూర్చుని తప్పించుకుంటారు. అదే సమయంలో సరిగ్గా కాల్పులు జరుపుతున్న గన్ కు ఎదురుగా ఉన్న సైనికుడు.. తృటిలో ప్రాణాలు కాపాడుకోవడం వీడియోలో చూడవచ్చు. 

డ్రోన్‌లను ఎదుర్కోవడానికి తయారు చేసిన రష్యన్ మొబైల్ ఫైర్ గ్రూప్‌కు సంబంధించిన ట్రైనింగ్  కార్యక్రమంలో ఈ ఘటన జరిగిందని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. 

యాక్‌బి-12.7 అనే మెషీన్ గన్ హెలికాప్టర్ నుంచి ఉపయోగించడానికి రూపొందించారు. ఈ ఆయుధం తీవ్రంగా వెనక్కు నెట్టే శక్తిని (రికాయిల్) కలిగి ఉంటుంది. విమానంలో మౌంట్ కు ఫిట్ చేయడంతో.. ఆ మౌంట్ దాని శక్తిని కంట్రోల్ చేస్తుంటుంది.  అంతటి శక్తివంతమైన ఆయుధాన్ని మౌంట్ ఆధారంగా వినియోగించకుండా.. ఒక సైనికుడే మెయింటెనెన్స్ చేసేందుకు వెళ్తే జరిగిన అనర్థమిది. పవర్ ఫుల్ వెపన్ ను మనుషులు వాడితే అది అదుపు తప్పితే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

నిమిషానికి 4,000 నుండి 5,000 రౌండ్లు కాల్చగల సామర్థ్యం ఉన్న యాక్‌బి-12.7 అనేది, సోవియట్ భారీ మెషిన్ గన్‌లలో ఉపయోగించే 12.7108 మిమీ రౌండ్ కోసం ఛాంబర్ చేసిన గన్ ఇది.