మెదక్ పట్టణంలో జూలై7న అథ్లెటిక్స్  సెలెక్షన్స్

మెదక్ పట్టణంలో జూలై7న అథ్లెటిక్స్  సెలెక్షన్స్

మెదక్, వెలుగు : తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు మెదక్​ పట్టణంలోని అథ్లెటిక్స్ స్టేడియంలో ఈ నెల 7న మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అండర్14, 16, 18, 20 బాల బాలికలకు, మెన్ అండ్ ఉమెన్ మెదక్ జిల్లాస్థాయి సెలెక్షన్స్​ నిర్వహించనున్నట్టు మెదక్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణర్తి వెంకటరమణ మధుసూదన్ శనివారం తెలిపారు.

ఈ సెలెక్షన్స్​లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 18న మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులు తమ వెంట వయసు ధ్రువీకరణ పత్రం లేదా ఎస్ఎస్ సీ మెమో తీసుకొని రావాలని సూచించారు.