మంజీర నదిలో మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు..మరో ఇద్దరుఅమ్మాయిలు సురక్షితం..మెదక్ జిల్లాలో ఘటన

మంజీర నదిలో మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు..మరో ఇద్దరుఅమ్మాయిలు సురక్షితం..మెదక్ జిల్లాలో ఘటన

పాపన్నపేట, వెలుగు: ప్రమాదవశాత్తు మంజీర నదిలో మునిగిపోయిన నలుగురిలో ఇద్దరు మృతి చెందిన ఘటన మెదక్​ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పొడిచన్‌‌‌‌పల్లి శివారులో శుక్రవారం జరిగింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన విరాల ప్రకారం..  మండల పరిధిలోని చీకోడ్ గ్రామానికి చెందిన మంజుల (35) పొడిచన్‌‌‌‌పల్లిలోని తన అక్క స్వప్న వద్దకు వచ్చింది. 

ఈ సందర్భంగా స్వప్న తన ఇద్దరు కూతుళ్లు, వారి ఆడ బిడ్డ కూతురు, మంజులతో కలిసి మంజీర తీరంలో ఉన్న వారి పొలం వద్దకు వెళ్లారు. అక్కడ నదిలో గల చెక్ డ్యాం వద్ద వారంతా స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నలుగురు నీటిలో మునిగిపోయారు. దీన్ని నది ఒడ్డుపై ఉన్న స్వప్న భర్త కపిల్ గమనించి వెంటనే తన కూతురు శృతితో పాటు కోడలు శివానిని రక్షించాడు. 

స్వప్న కూతురు స్ఫూర్తి (16), మంజుల చనిపోయారు. కాగా, స్ఫూర్తి  సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట రెసిడెన్షియల్ స్కూల్​లో పదో తరగతి చదువుతోంది.  మృతుల కుటుబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.