మెదక్: కుమారుడి వేధింపులపై తల్లి ఫిర్యాదు

మెదక్: కుమారుడి వేధింపులపై  తల్లి ఫిర్యాదు

మెదక్​టౌన్, వెలుగు: కుమారుడు వేధిస్తున్నాడని మెదక్​ పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు సోమవారం ఎస్పీ డీవీ శ్రీనివాస రావుకు ఫిర్యాదు చేశారు. ఆటోలో వచ్చిన బాధితురాలి వద్దకు ఎస్పీ వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. కారుణ్య నియామకం ద్వారా కొడుకుకు ఉద్యోగం ఇప్పించిన తర్వాత తనను పట్టించుకోవడంలేదని వృద్ధురాలు వాపోయింది. 

క్యాన్సర్​తో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలి సమస్యను అడిగి తెలుసుకున్నారు. టౌన్  సీఐ మహేశ్ ను పిలిపించి, వృద్ధురాలి ఫిర్యాదుపై వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.