మేధా శంకర్.. తెలుగు ఫ్యాన్స్ కి పెద్దగా తెలీదు . కానీ బాలీవుడ్ లోలో మాత్రం ఒక్క చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. '12th ఫెయిల్' చిత్రంలో మెస్మరైజింగ్ యాక్టింగ్ తో అదరగొట్టేసింది. అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు బుల్లితెరపై కూడా మెరిసింది.
ఇక మేధా బాలీవుడ్ లో లేటెస్టుగా నటించిన రొమాంటిక్ కామెడీ సీక్వెల్ చిత్రం 'జిన్నీ వెడ్స్ సన్నీ-2' . ప్రశాంత్ ఝా దర్శకత్వం వహించిన ఈ మూవీలో అవినాష్ తివారీ లీడ్ రోల్ లో నటించారు. ఏప్రిల్ 24న ఈ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్స్ చేశారు. ఇప్పుటి కే ఈ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానులతో ఫుల్ టచ్ లోనే ఉంటూ అలరిస్తూ ఉంటుంది మేధా శంకర్
తాజాగా ఈముద్దుగుమ్మ గ్రీన్ లెహంగాలో అందాలు ఆరబోసింది. పొడవాటి ఉంగరాల జుట్టు, గోల్డ్ ఎంబ్రాయిడరీ, జుమ్మాలు, గాజులు, స్టేట్మెంట్ చోకర్ తో స్టన్నింగ్ పోజు ఇచ్చింది. ఇన్ స్టా వేదికగా పిక్స్ షేర్ చేస్తింది. 'జిన్నీ తన పెళ్లి కోసం చాలా ఉత్సాహంగా ఉంది! మీరు కూడానా? మా సినిమా 'జిన్నీ వెడ్స్ సన్నీ 2' ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే మీరందరూ వేచి చూచే దాకా నేను ఉండలేను' అంటూ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
