సంగారెడ్డి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 8.
విభాగాల వారీగా ఖాళీలు: మల్టీ పర్పస్ వర్కర్ 2, ఆయుష్ డాక్టర్ (పీజీ అర్హత కలిగినవారు) 1, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 2, డైటీషియన్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద, యునాని, హోమియోపతి లేదా నేచురోపతి విభాగంలో డిగ్రీ, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఫార్మా.-డి, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్, నేచురోపతిలో డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్, ఎనిమిదో తరగతితోపాటు సైకిల్/ మోటార్ సైకిల్ నడప కలిగే సామర్థ్యం ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 22
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
