నాగచైతన్య, మీనాక్షి చౌదరి రాయల్ లుక్.. 'వృషకర్మ’ రాజస్థాన్ షెడ్యూల్ ప్యాకప్!

నాగచైతన్య, మీనాక్షి చౌదరి రాయల్ లుక్.. 'వృషకర్మ’ రాజస్థాన్ షెడ్యూల్ ప్యాకప్!

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన  కెరీర్‌లోనే ముందెన్నడూ లేని సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘విరూపాక్ష’ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ నటిస్తున్న లేటెస్ట్ మిస్టికల్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను బాపినీడు సమర్పిస్తున్నారు.

రాజస్థాన్ కోటల్లో షెడ్యూల్..

ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ, కీలకమైన షెడ్యూల్‌ను ఇటీవల రాజస్థాన్‌లోని పురాతన రాజభవనాలలో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ లొకేషన్స్ నుండి చిత్రబృందం విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్  సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. నాగచైతన్య, హీరోయిన్ మీనాక్షి చౌదరిల రాయల్ లుక్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. కథలోని పురాతన రహస్యాలు, మైథాటిజీ ఎలిమెంట్స్ కు ఈ రాజస్థాన్ నేపథ్యం పర్‌ఫెక్ట్‌గా సెట్ కానుందని టాక్ వినిపిస్తోంది..

 

గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్..

ఇప్పటికే విడుదలైన ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్‌లో ఏకంగా 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. కార్తీక్ దండు మార్క్ సస్పెన్స్, అజనీష్ లోక్‌నాథ్ (కాంతార ఫేమ్) ఇచ్చిన గగుర్పాటు కలిగించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాలో హై-లెవెల్ గ్రాఫిక్స్, హాలీవుడ్ రేంజ్ సీజీఐ (CGI) వర్క్ ఉండబోతోందని సమాచారం.

బాలీవుడ్ విలన్ ఎంట్రీ..

ఈ సినిమాలో ‘లాపతా లేడీస్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్పర్ష్ శ్రీవాస్తవ పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నారు. చైతూ వర్సెస్ స్పర్ష్ మైండ్ గేమ్స్ థియేటర్లలో నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వనున్నాయి. అలాగే మలయాళ స్టార్ నటుడు జయరామ్, టాలీవుడ్ కామెడీ యాక్టర్ సత్య ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫాంటసీ, మిస్టరీ జానర్లలో వస్తున్న ఈ ‘వృషకర్మ’ ఒక అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా మారనుంది చిత్రబృందం ధీమాగా ఉంది. ఈ భారీ మైథికల్ థ్రిల్లర్ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ మరికొద్ది రోజుల్లోనే రానుంది.