టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం విజయ్ తన కేబినెట్ లోకి 9మందికి తీసుకున్నారు. విజయ్ కేబినెట్‌లో అతి చిన్న వయసులో మంత్రిఅయిన 29 ఏళ్ల ఎమ్మెల్యే, ఓ డాక్టర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి ,మరో ఏడుగురు నేతలు ఉన్నారు. విజయ్ కేబినెట్ లో యంగెస్ట్ లీడర్ 29 ఏళ్ల ఎస్ .కీర్తనకు చోటు దక్కింది. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో శివకాశి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. విజయ్ కేబినెట్ లో కీర్తన్ యంగెస్ట్ మినిస్టర్ కావడం విశేషం. తొలి జాబితాలో మంత్రులందరూ టీవీకే కు చెందినవారే.మరోవైపు విజయ్ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఎన్ ఆనంద్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అధవ అర్జున, డాక్టర్ , మాజీ ఐఆర్ ఎస్ అరుణ్ రాజ్ కు మంత్రి పదవులు దక్కాయి.
