మెగాస్టార్ చిరంజీవి రేపు (ఆగష్టు 22న) తన 71వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ‘మెగా158’ టీమ్ సిద్ధమైంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రీ-లుక్ పోస్టర్‌లో చిరంజీవిని సరికొత్త లుక్, మాస్ యాటిట్యూడ్‌తో చూపించారు.
ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో మెగాస్టార్‌ను ప్రజెంట్ చేయబోతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా స్పష్టమవుతోంది. “ కొత్త అవతారం.. కొత్త యాటిట్యూడ్.. మెగాస్టార్‌లో మునుపెన్నడూ చూడని సరికొత్త కోణం!” అనే క్యాప్షన్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచారు.
ఇక ఈ చిత్రాన్ని హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “ Mega158 స్ఫూర్తి ఒక్కటే.. ది బ్లడీ బెంచ్‌మార్క్‌ను సెట్ చేయడమే!” అనే ట్యాగ్‌లైన్ కూడా సినిమాకు ఉండబోయే యాక్షన్ రేంజ్‌పై ఆసక్తిని పెంచుతోంది.
The wait ends on the Megastar’s special day! 🔥
— Bobby (@dirbobby) August 20, 2026
On August 22nd, the #Mega158 Title Glimpse arrives. ❤️🔥
A new chapter. A new force.
A Brand New Megastar @KChiruTweets garu is coming! 💥#ChiruBobby2 @KvnProductions pic.twitter.com/CCNAhTGee1
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, 40 రోజులకు పైగా చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. ఫస్ట్ హాఫ్ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా తెరకెక్కిస్తున్నారని టాక్.
ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాబీ మార్క్ మాస్ టేకింగ్‌కు చిరంజీవి స్టార్‌డమ్ తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. మొత్తానికి ఆగస్టు 22న విడుదల కానున్న టైటిల్ గ్లింప్స్‌తో ‘మెగా158’ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మెగా అభిమానులు ఈ బర్త్‌డే ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
LOCKED & LOADED 😎💥
— Bobby (@dirbobby) August 21, 2026
Tomorrow, get ready for a MEGA BLAST like never before! 🔥🔥🔥#Mega158 #ChiruBobby2 https://t.co/2WIiNwNFNo
