నిహారిక లేటెస్ట్ స్టిల్స్ అదుర్స్..హీరోయిన్గా ఛాన్స్ దక్కేనా!

నిహారిక లేటెస్ట్ స్టిల్స్ అదుర్స్..హీరోయిన్గా ఛాన్స్ దక్కేనా!

మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. యాక్టర్గా, ప్రొడ్యూసర్గా బిజీ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన నిహారిక..ఇటీవలే వెబ్‌ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్గా ఇతర దేశాల్లో ట్రిప్స్కు వెళ్తూ..లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.  

లేటెస్ట్ గా నిహారిక ఒక స్టైలిష్ లుక్‌ ఫోటోను షేర్‌ చేసి మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. లైట్ కలర్‌ డ్రెస్ లో నిహారిక చాలా అందంగా క్యూట్‌ గా కనిపిస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ వెనుక..ఏదో కారణం అయితే బలంగా ఉందనే మాట వినిపిస్తోంది.

ఇప్పటికే హీరోయిన్ గా నాలుగు, ఐదు సినిమాలు చేసిన పెద్దగా ఆశించిన సక్సెస్ రాలేదు. దీంతో మళ్ళీ హీరోయిన్గా ఛాన్సెస్ కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 
మొన్నటి వరకు నిహారిక తన అన్న వరుణ్ తేజ్ పెళ్లి ఫొటోస్ ను పోస్ట్ చేయగా..ఇక లేటెస్ట్ ఫ్టోస్ తో సోషల్ మీడియాను షేక్ చేసే పనిలో బిజీగా ఉంది.
 
ఇప్పటివరకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు నిర్మించగా..ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసే ఫీచర్ ఫిలింస్ నిర్మాణంలోకి దిగిపోయింది. నిర్మాతగా తన తొలి సినిమాను కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేసింది.