మెగాస్టార్ చిరంజీవి.. భోళా బీభత్సం అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి.. భోళా బీభత్సం అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)  లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola shankar)  నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల జూలై 27న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు  పోస్టర్ రిలీజ్ చేశారు. మాస్ అవతారంలో కనిపిస్తోన్న చిరంజీవీ లుక్ మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఒక చేత్తో కత్తి పట్టుకుని వస్తున్న చిరు.. వింటేజ్ పవర్ తో.. బాక్సాఫీస్ బాస్ కా మాస్ అనే ఫీలింగ్ ఇస్తుంది. చిరు అగ్రెసివ్ లుక్స్  ఇంద్ర.. ఠాగూర్  మూవీస్ టైం ను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్ లో  “ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నావాళ్లే. ఆల్ ఏరియాస్ అప్నా హై. నాకు హద్దులు లేవు.. సరిహద్దులు లేవు"  తెలంగాణ స్లాంగ్  డైలాగ్స్ యూత్ ను వీపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ లో ఎలాంటి మాస్ డైలాగ్స్ ఉండబోతున్నాయి అని మెగాఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ  మూవీ నుండి రిలీజైన సాంగ్స్ చిరు గ్రేస్ స్టెప్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  ఈ మూవీలో చిరు యాక్షన్ తో పాటు తనదైన కామెడీ యాంగిల్ లో మెగా మార్క్ చూపిస్తారని టాక్ వినిపిస్తోంది.

మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో చిరుకు జోడీగా మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుంది. మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. మరో కీలకపాత్రలో సుశాంత్ కనిపించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై భోళా శంకర్ చిత్రాన్ని రామ్‍బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.