వరుణ్ లావణ్య పెళ్లి కోసం భారీ ఖర్చు.. మతిపోగొడుతున్న లెక్కలు

వరుణ్ లావణ్య పెళ్లి కోసం భారీ ఖర్చు.. మతిపోగొడుతున్న లెక్కలు

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్(Varun tej) లావణ్య(Lavanya tripahi) పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 1న ఇటలీలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అతంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే.. ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లికి సంబందించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ఈ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ భారీగానే ఖర్చు చేశారట. ప్రస్తుతం వినిపిస్తున్న లెక్కల ప్రకారం ఈ పెళ్లి కోసం ఏకంగా రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేశారట. పెళ్లి కార్డ్స్ నుండి  ఇటలీలో జరిగిన కాక్ టెల్ పార్టీ, హల్దీ, మెహందీ, పెళ్లి ఇలా ప్రతి కార్యక్రమం గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నారట. తన కొడుకు పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని డిసైడ్ అయ్యారట నాగబాబు. అందుకే ఖర్చుకు వెనుకాడలేదని సమాచారం. 

ALSO READ : హీరోయిన్ రంభ వచ్చేస్తోంది.. ఆ హీరోతోనే రీ ఎంట్రీ!

ఇక ఇప్పటివరకు జరిగిన కేవలం పెళ్ళికి సంబంధించిందే. నవంబర్ 5న హైదరాబాద్ లో రెసెప్షన్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నా ప్రముఖులు హాజరుకానున్న ఈ రెసెప్షన్ కోసం కుక్కడ భారీ ఏర్పాట్లు చేశారని సమాచారం. దాదాపు 1000 మంది హాజరుకానున్న ఈ వేడుక కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.