పవన్కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులే : చిరంజీవి

పవన్కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులే : చిరంజీవి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్నది అభిమానులు కాదు.. భక్తులేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రముఖ సింగర్‌ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘నిజం విత్‌ స్మిత’ టాక్‌ షోకు హాజరైన ఆయన తమ్ముని గురించి తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. పవన్ మీకు నటుడిగా ఇష్టమా లేకా పొలిటిషన్ గా ఇష్టమా అని స్మిత అడిగిన ప్రశ్నకు స్పందించిన చిరు.. పవన్ కళ్యాణ్  సహజత్వాన్ని బట్టి చూస్తే ఏదో ఒక రోజు గొప్ప నాయకుడు అవుతాడని అన్నారు. ప్రజలకు ఏదో చేయాలనే తపన, బాధలకు స్పందించే తీరు అతనిలో చిన్నప్పటి నుంచి ఉందన్నారు. పవన్ కున్న ఫ్యాన్స్ బేస్ డిఫరెంట్ అన్న మెగాస్టార్.. వాళ్లను అభిమానులు అనొద్దని, భక్తులు అనాలని అన్నారు. పవన్ నటుడుగా కంటే పొలిటిషన్ గానే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో  ఈ షో ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.