పుష్ప 2 ఫస్ట్ లుక్పై చిరంజీవి స్పందన

పుష్ప 2 ఫస్ట్ లుక్పై చిరంజీవి స్పందన

పుష్ప మూవీ సూపర్ హిట్ కావడంతో...అంతా పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏప్రిల్ 8వ తేదీన హీరో అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో పుష్ప యూనిట్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. బన్ని పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 సినిమాలోని స్పెషల్‌ లుక్‌ను రిలీజ్ చేసింది.  అమ్మవారి గెటప్‌ లో అల్లు అర్జున్ భయపెడుతున్నాడు. పుష్ప 2 లుక్ తో ఈ  సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ ఫోటో ట్రెండ్ అవుతుండగా..పుష్ప 2 ఫస్ట్ లుక్ పై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. 

మెగా ప్రశంసలు..

అల్లు అర్జున్ కు మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బన్నిని చిరంజీవి మెచ్చుకున్నారు. హ్యాపీబర్త్‌ డియర్‌ బన్నీ.... ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి... పుష్ప: దిల్‌ రూల్‌లో  నీ ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. ఆల్‌ ది వెరీ బెస్ట్‌.. అని చిరంజీవి  ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ వైరల్ అయింది. 

సోషల్ మీడియాలో ట్రెండ్..

మరోవైపు ‘వేరీ ఈజ్‌ పుష్ప’ అంటూ  మూవీ యూనిట్ రిలీజ్ చేసిన వీడియో పుష్ప2 చిత్రంపై అంచనాలను పెంచుతోంది.  అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం....అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే.. పుష్ప వచ్చిండాడు అని అర్థం.. అంటూ చెబుతున్న డైలాగ్‌ హైలెట్ గా ఉంది. ప్రస్తుతం ఈ  వీడియో  తెలుగు సినిమా టీజర్లలో మూడో స్థానంలో నిలిచి రికార్డు క్రియేట్ చేసింది.  దాదాపు ఇప్పటి వరకు 22మిలియన్లకు పైగా వీడియోను వీక్షించారు. అలాగే హిందీ వెర్షన్ వీడియో 30 మిలియన్ మంది వీక్షించారు. అటు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాలో అత్యధిక మంది లైక్‌ చేసిన ఫస్ట్‌లుక్‌గా ఈ స్టిల్‌ నిలిచింది.