మెగాస్టార్ 'భోళా శంకర్' టీజర్ అప్డేట్..

మెగాస్టార్ 'భోళా శంకర్' టీజర్ అప్డేట్..

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న 'భోళా శంకర్' (Bhola Shankar) మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజగా ఈ మూవీ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 24న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగాస్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజైన ‘భోళా మానియా" సాంగ్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ లో చిరు తన మార్క్ స్టెప్స్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఈ ఒక్క సాంగ్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 

తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా వస్తున్న ‘భోళా శంకర్’ చిత్రం అన్న చెల్లెళ్ల సెంటిమెంట్ తో రాబోతుంది. ఈ సినిమాలో త‌మ‌న్నా (tamanna bhatia) హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. చిరుకు చెల్లెలు పాత్ర‌లో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(keerti suresh) క‌నిపించ‌నుంది. టాలెంటెడ్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ మూవీని.. ఏకె ఎంటెర్టైన్మెంట్స్ (AK Entertinements) బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర(Rama brahmam sunkara) నిర్మిస్తుండగా.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.