మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు గాడ్ ఫాదర్ మూవీ మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న‘గాడ్ ఫాదర్’ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. నల్ల కళ్లద్దాలు ధరించి... చైర్ లో కూర్చొని సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్న చిరు లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్‌లో రూపొందుతున్న మూవీ 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్'కు ఇది రీమేక్.  

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ ఖాన్, నయనతార, సత్యదేవ్, యాంకర్ అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.