మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‍ లేటెస్ట్ అప్డేట్?

మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‍  లేటెస్ట్ అప్డేట్?

డైరెక్టర్ వశిష్ట( vishishta)  బింబిసార వంటి సోషియో ఫాంటసీ హిట్ తో ఇండస్ట్రీని ఆకర్షించారు. వశిష్ట తన సెకండ్ ఫిల్మ్ కోసం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి ఓ స్టోరీ వినిపించి..ఇంప్రెస్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.  

ఇక వీరిద్దరి కాంబో నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల (ఆగస్టు 22న) మెగాస్టార్ బర్త్ డే సందర్బంగా చిరంజీవి-వశిష్ఠ కాంబినేషన్‍లో వస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం నుంచి మెగా అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. 

ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతుందని టాక్. ఇక ఈ మూవీ చిరంజీవి గతంలో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ సినిమాను మల్లిడి వశిష్ట తీర్చి దిద్దనున్నడని సమాచారం.యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. 

అలాగే..పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ ఒక వీరుడి పాత్రలో కనిపించనున్నాడట. అందుకే ఈ సినిమాకి  ముల్లోక వీరుడు(Mulloka Veerudu) అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు..ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ తో ఆడిపాడనున్నాడట చిరు. ఇక ఈ విషయం తెల్సుకున్న మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకట రావాల్సి ఉంది.

ఇక చిరంజీవి లేటెస్ట్ భోళా శంకర్ మూవీ మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్(Sushanth) ప్రధాన పాత్రల్లో నటించారు. అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మించిన ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. కాగా ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వచ్చింది. 

భోళా శంకర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.30 కోట్ల గ్రాస్, రూ.15 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసినట్టు సమాచారం. మెగాస్టార్ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇక తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటిరోజు రూ.12 కోట్లు కలెక్ట్ చేయగా..  మిగిలిన ప్లేసెస్ లో కలిపి రూ.3 కోట్లు మాత్రమే  కలెక్ట్ చేసింది.