మెగాస్టార్ మూవీలో.. విలన్ గా చిరు వీరాభిమాని?

మెగాస్టార్ మూవీలో.. విలన్ గా చిరు వీరాభిమాని?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ (Kalyan Krishna)  డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసేందే. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. చిరంజీవికు వీరాభిమాని అయినా హీరో కార్తికేయను ఈ మూవీలో విలన్ గా సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. 

ఇప్పటికే మెగాస్టార్ చిరు 'గాడ్ ఫాదర్' మూవీలో మెగా అభిమాని అయినా సత్యదేవ్ (Satyadev) ను విలన్ గా రిఫర్ చేయడం తెలిసేందే. అయితే కళ్యాణ్ కృష్ణ మూవీ లో కూడా తన అభిమాని కార్తికేయను విలన్ గా చిరు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కు ఇక కిక్కే.  

RX 100 మూవీతో హీరోగా పరిచయమైన కార్తికేయ (Kartikeya).. తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా స్టార్ హీరో అజిత్ (Ajith)  నటించిన 'వలిమై' మూవీలో విలన్ గా యాక్ట్ చేసి మెప్పించాడు. మరోసారి చిరుతో తలపడునున్న కార్తీకేయకు ఎలాంటి బలమైన గుర్తింపు వస్తుందో చూడాలి.   

‘ధమాకా’ రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్(Bezawada Prasanna Kumar)  స్టోరీని అందిస్తుండగా.. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల (Sushmita Konidela), ఆమె భర్త విష్ణు ప్రసాద్(Vishnu Prasad) సంయుక్తంగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ (Gold box entertainments)  బ్యానర్ పై ఈ మూవీను నిర్మిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని  వివరాలు మేకర్స్ ప్రకటించునున్నారు.