మెగాస్టార్ v/s సూపర్ స్టార్.. ఈసారి బాక్సాఫీస్ కింగ్ ఎవరు?

మెగాస్టార్ v/s సూపర్ స్టార్.. ఈసారి బాక్సాఫీస్ కింగ్ ఎవరు?

ఒకవైపు మెగాస్టార్(Megastar), మరోవైపు సూపర్ స్టార్(Super Star). ఈ ఇద్దరు బడా హీరోలు చాలా గ్యాప్ తరువాత బాక్సాఫీస్ వార్ కు సిద్ధమయ్యారు. కేవలం ఒక్కరోజు గ్యాప్ లో కలెక్షన్ల సునామి సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఆ ఇద్దరు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth). మరి ఈ వార్ లో ఎవరు గెలుస్తారు? ప్రేక్షకులు, ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 మెగాస్టార్ తన తరువాతి సినిమా భోళా శంకర్(Bhola shankar) ప్రమోషన్స్ మొదలుపెడుతుంటే.. రజనీకాంత్ రీసెంట్ గా తన జైలర్ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసాడు. భోళా శంకర్ నుండి రీసెంట్ గా సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మెహర్ రమేష్(Meher ramesh) డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తరువాత చిరంజీవి నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 

ఇక మరోవైపు.. రజనీకాంత్ సినిమా జైలర్(Jailer) ఆగస్టు 10న థియేటర్స్ లో కి రానుంది.  నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. శివరాజ్ కుమార్(Shivraj kumar), మోహన్ లాల్(Mohan lal), సునీల్(Sunil), రమ్యకృష్ణ(Ramya krishna), మిర్నా(Mirna) వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ప్రమోషన్స్ కూడా  మొదలుకానున్నాయి. 

ఇక ఈ రెండు భారీ సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో వస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సీనియర్ ల బాక్సాఫీవ్ వార్ ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? ఈ రెండు సినిమాల్లో మిల్కీ బ్యూటీ తమన్నానే(Thamannah) హీరోయిన్ గా నటిస్తోంది.