తెలంగాణ డైరెక్టర్తో చిరు..బాక్సాఫీస్ లెక్కలు లెక్కేట్టాల్సిందే!

తెలంగాణ డైరెక్టర్తో చిరు..బాక్సాఫీస్ లెక్కలు లెక్కేట్టాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. చిరంజీవి నటించే కొత్త మూవీని ప్రకటించబోతున్నారు. ఎన్నో హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్, డైలాగ్ రైటర్ గా పనిచేసిన బి.వి.ఎస్ రవి(BVSN Ravi) రెడీ చేసిన స్టోరీలో నటించబోతున్నట్లు సమాచారం.

బి.వి.ఎస్ రవి చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మెగా డాటర్ సుస్మిత కొణెదల హౌస్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీని హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో హీరో రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సెట్లో జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం. ఇక అప్పటిలోపు చిరంజీవి విశ్వంభర మూవీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మరి హరీష్ శంకర్ మ్యానరిజమ్కి చిరు మెగా ఇజమ్ తోడైతే..బాక్సాఫీస్ లెక్కలు లెక్కేట్టాల్సిందే! 

అయితే..చిరంజీవి బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్ లో రీమేక్ ఫిల్మ్ బ్రో డాడీ రాబోతున్నట్టు వార్తలు రాగా.. ప్రస్తుతానికి ఆ చిత్రం తెరకెక్కట్లేదని సమాచారం.ఈ మూవీని సుష్మిత ఓన్ ప్రొడక్షన్ లో నిర్మించాలని డిస్కషన్స్ కూడా జరిగాయి.

ఇక అంతలోనే చిరు రీమేక్ ఫీల్మ్ భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో..బ్రో డాడీ మూవీకి ఫుల్ స్టాప్ పడింది. దీంతో తన తండ్రి చిరంజీవితో ఎలాగైనా ఓ మూవీ చేయాలనీ మెగా డాటర్ ఫిక్స్ అవ్వగా..ఎట్టకేలకు బి.వి.ఎస్ రవి రెడీ చేసిన స్టోరీని సెలెక్ట్ చేసింది. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆఫీసియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.