Waltair Veerayya : మాస్ రాజా అల్లరి పిల్లాడు : చిరు

Waltair Veerayya : మాస్ రాజా అల్లరి పిల్లాడు : చిరు

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‭లో రవితేజతో తనకున్న అనుబంధం గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. ఆజ్ కా గుండా రాజ్ సినిమాలో రవితేజ ఓ స్నేహితుడి వేషంలో కనిపించాడని చెప్పారు. బెజవాడలో పుట్టి.. బాంబేలో పెరిగిన రవితేజ హిందీ బాగా మాట్లాడతాడని అన్నారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రవితేజ బాంబే హీరోలాగా కనిపించేవాడని అన్నారు.

నువ్వేం తక్కువోడివి కాదు మాస్ రాజా అంటూ రవితేజను మెగాస్టార్ ఆట పట్టించారు. ఏటిది అంటావేంటి నన్ను మాట్లాడని అంటూ నవ్వించారు. రవి ఎక్కువ ఎంటర్ టైన్‭మెంట్ చేస్తూ.. షూటింగ్ లో నవ్విస్తూ ఉంటాడని చిరు చెప్పారు. మాస్ మహారాజా అల్లరి పిల్లాడని.. అన్నయ్య సినిమా నుంచి రవిని చూస్తున్నానని... మాస్ మహారాజ్ అంటూ తనకంటూ ముద్రవేసుకుని ఒక ఇమేజ్‭ని ఏర్పాటు చేసుకున్న చక్కని నటుడంటూ చిరంజీవి ప్రశంసించారు. బాబీ వాల్తేర్ వీరయ్యలో రవితేజ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఇంట్రస్టింగ్‭గా అనిపించిందన్నారు. మూవీలో రవితేజ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా ఇంకో లెవెల్‭కి వెళ్లిందని చెప్పారు.