మెగాస్టార్తో అనిల్ మూవీ.. ఈసారి పక్కా తెలంగాణ యాసలో!

మెగాస్టార్తో అనిల్ మూవీ.. ఈసారి పక్కా తెలంగాణ యాసలో!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం భోళా శంకర్(Bhola Shankar) రిలీజ్ తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా(Thamannaah), కీర్తి సురేష్(Keerthi Suresh), సుశాంత్(Sushanth) ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా తరువాత మెగాస్టార్ చేయబోయే సినిమాపై ఆసక్తినెలకొంది. దానికి కారణం చిరు తరువాతి సినిమా లిస్టులో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఒకరు. ఈ దర్శకుడి సినిమాలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. కామెడీ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయాడు అనిల్. దీంతో ఈ దర్శకుడు తన తరువాతి సినిమాను చిరంజీవితో చేయనున్నాడు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం అనిల్ చంటబ్బాయి స్టైల్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశారట. బాస్ నుండి ఒక కాల్ వస్తే చాలు ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నాడట అనిల్. ఈ ప్రాజెక్టు గనక ఓకే అయితే.. చిరు నుండి చాలా రోజుల తరువాత పక్కా ఎంటర్టైనర్ మూవీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో చిరు డైలాగ్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉండనున్నాయని సమాచారం. 

ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం మాస్ హీరో బాలకృష్ణ(Balakrishna)తో భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా చేస్తున్నారు. మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలో థియేటర్స్ లోకి రానున్న రిజల్ట్ పైనే అనిల్, చిరు కాంబో ఆధారపడి ఉండనే వాదనలు వినిపిస్తున్నాయి.