వామ్మో..! ఆ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారా.. వద్దు అన్నయ్య అంటున్న ఫ్యాన్స్

వామ్మో..! ఆ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారా.. వద్దు అన్నయ్య అంటున్న ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. గత సంక్రాంతికి వాల్తేరు వీరయ్య(Valteru Veerayya)తో భారీ హిట్ అందుకున్న చిరు.. ఆతరువాత చేసిన భోళా శంకర్(Bhola Shankar) తో బిగ్గెస్ట్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి(Vassishta Mallidi)తో విశ్వంభర(Vishwambhara) సినిమా చేస్తున్నారు మెగాస్టార్. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఆ సందర్బంగా రిలీజైన టైటిల్ వీడియోతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

ఈ సినిమా తర్వాత చిరు ఏ డైరెక్టర్ తో సినిమా చేయనున్నారు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ లిస్టులో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్, క్లాస్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల, అనిల్ రావిపూడి, BVS రవి(మచ్చ రవి) పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం ఈ దర్శకులలో BVS రవి చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందట. వెంటనే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయమని, సినిమా మొదలుపెడదామని చెప్పాడట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

కారణం BVS రవి రచయితగా అందరికీ పరిచయమే. కానీ, దర్శకుడిగా ఆయనకు హిట్స్ లేవు. ఆయన చేసిన రెండు సినిమాలు వాంటెడ్, జవాన్ సినిమాలు ఫప్లాప్ గా నిలిచాయి. ఇటీవల ఆయన కథ అందించిన థాంక్ యూ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఆ దర్శకుడితో సినిమా అవసరమా.. వద్దు అన్నయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.