చంద్రబోస్ సరస్వతి పుత్రుడు : చిరు

చంద్రబోస్ సరస్వతి పుత్రుడు : చిరు

సినీగేయ రచయిత చంద్రబోస్ ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. చంద్రబోస్ రచించిన నాటు నాటు పాటకు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆయనను సత్కరించారు. వాల్తేరు వీరయ్య విజయోత్సవ సమావేశంలో చిరంజీవి, రవితేజ కలిసి చంద్రబోస్ ను శాలువాతో సన్మానించారు.

చంద్రబోస్ రాసిన పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం గర్వకారణంగా ఉందని చిరంజీవి అన్నారు. తొలిసారి తెలుగు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. కీరవాణితోపాటు పాటలో భాగస్వాములైన వారందరికి చిరు అభినందనలు తెలియజేశారు. తెలుగు వాళ్లందరి తరపున చంద్రబోస్ కు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు చెప్పారు. చంద్రబోస్ సరస్వతీ పుత్రుడు అని ఆయన ప్రశంసించారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నిన్న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ వద్ద చిరు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.