Megastar Chiranjeevi: నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా?.. అవమానాన్ని ఆయుధంగా మార్చుకున్న చిరు

Megastar Chiranjeevi: నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా?.. అవమానాన్ని ఆయుధంగా మార్చుకున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కెరీర్ ప్రారంభంలో ఆయనకు జరిగిన ఒక చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. తాజాగా చిరంజీవి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. 

ఈవెంట్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న సమస్యల, అవమానాల గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అలా జీవితంలో తాను ఎదుర్కొన్న అవసమానం గురించి గుర్తుచేసుకున్నారు చిరంజీవి. ఆ సంఘటన గురించి వివరిస్తూ.. న్యాయం కావాలి షూటింగ్ సమయంలో..  కోర్ట్ సీన్ షూట్ జరుగుతోంది. డైరెక్టర్ క్రాంతి కుమార్ క్రేన్ మీద కెమెరాతో సిద్ధంగా ఉన్నారు. ఆ సీన్ లో శారద, జగ్గయ్య లాంటి పెద్ద పెద్ద నటులు ఉన్నారు. బయట ఉన్న నాకు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అనగానే నేను వెళ్లి కోర్టు బోనులో నిల్చున్నాను. అది గమనించిన దర్శకుడు క్రాంతి కుమార్.. నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా? ఇక్కడే ఉండొచ్చు కదా. సీనియర్స్ నీకోసం ఎదురుచూస్తున్నారు. నిన్ను కూడా ఒకళ్లు పిలవాలా. అని కోపంగా అనేశాడు. అలా అందరిముందు అనేసరికి అవమానంగా అనిపించింది అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. 

అయితే.. అదే సాయంత్రం క్రాంతి కుమార్ కాల్ చేసి వేరే వాళ్లపై కోపం నీపై చుపించానని సారీ కూడా చెప్పరటా. అయితే.. క్రాంతి కుమార్ చేసిన అవమానం కంటే ఆయన అన్న ఒక్క మాటను మాత్రం బలంగా పెట్టుకున్నారట చిరంజీవి. అదేంటంటే.. నేవ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా? అన్నాడు కదా.. ఎలా అయినా స్టార్ అని అయ్యి చూపిస్తా అని కష్టపడటం మొదలుపెట్టారట చిరంజీవి. అలా మనకు జరిగిన అవమానాలను ఆయుధాలుగా తీసుకొని పాణిం చేస్తే విజయం దానంతట అదే వరిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.