మెగాస్టార్​ చిరంజీవి మోకాలికి సర్జరీ

మెగాస్టార్​ చిరంజీవి మోకాలికి సర్జరీ

మెగాస్టార్​చిరంజీవి మోకాలికి సర్జరీ జరిగింది. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఈ చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. మోకాలిలో తరచూ నొప్పి రావడంతో మెడికల్​ టెస్ట్​లు చేయించుకున్నారు. 

డాక్టర్ల సూచన మేరకు ఎలాంటి కోత లేకుండానే ఆర్థ్రోస్కోపిక్​ విధానంలో ఇన్ఫెక్షన్​తొలగించారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వారంలో హైదరాబాద్​కి తిరిగిరానున్నట్లు ఆయన పీఆర్​బృందం తెలిపింది. 

చిరంజీవికి మోకాలికి శస్త్ర చికిత్స జరగనున్నట్టు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో ఈ న్యూస్​ నిజమే అని తేలడం.. సర్జరీ పూర్తి విజయవంతంగా పూర్తి కావడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇది తీవ్రంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.