‘బ్రహ్మాస్త్ర' తెలుగు వెర్షన్ ట్రైలర్ కు మెగాస్టార్ వాయిస్

‘బ్రహ్మాస్త్ర' తెలుగు వెర్షన్ ట్రైలర్ కు మెగాస్టార్ వాయిస్

బాలీవుడ్ స్టార్స్ ర‌ణ్‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ లు ప్రధానపాత్రల్లో న‌టిస్తోన్న భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కానుండగా..  తెలుగు వెర్షన్ కి బ్రహ్మాస్త్రం అనే పేరును కూడా ఖరారు చేశారు. అయితే ఈ మూవీలో  బాలీవుడ్ సీనియ‌ర్ సూప‌ర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చన్‌, టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున కీల‌క పాత్రల్లో న‌టిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరో కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. ఆయనెవరో కాదు తెలుగు సినీ పరిశ్రమలో మేటిగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి. ఆయన తన వాయిస్ తో అభిమానులను అలరించనున్నట్టు ఇప్పటికే పలు వార్తలకు దర్శక ధీరుడు రాజమౌళి తెరదించారు. స్వయంగా నే ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ వాయిస్ ప్రోమోను సరిగ్గా గమనిస్తే చివరల్లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ  ఎమోషనల్ అవ్వడం గమనించొచ్చు. అంతే కాదు చిరు కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నట్టు కూడా చూడొచ్చు. 

ఇక అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా.. అందులో తొలి భాగానికి శివ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ జూన్ 15న విడుదల కానుండగా.. సెప్టెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి అసోసియేట్ అవుతున్నారనే వార్తలు నిజం కావడంతో అభిమానులు ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.