మెగాస్టార్‌ని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

మెగాస్టార్‌ని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

తెలుగు రాష్ట్రాలకు బ్రిటన్ నూతన డిప్యూటీ హై కమిషనర్ గా నియమితులైన గారెత్ విన్ ఓవెన్ కు మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం ఇచ్చారు. ఇంటికి వచ్చిన గారెత్ కు చిరు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరు ట్వీట్ చేశారు. సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగినట్లు చెప్పారు. బ్రిటన్, భారత్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక విషయాలపై చర్చించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ వంటకాలతో ఆయనకు విందు ఇచ్చినట్లు తెలిపారు. ఆవకాయను మరిచిపోలేదంటూ ట్వీట్ లో చిరు పేర్కొన్నారు. ఇప్పటిదాకా డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గా వ్యవహరించారు. ఫ్లెమింగ్ పదవీకాలం జులైలో ముగియనుంది. ఆయన స్ధానంలో గారెత్ విన్ ఓవెన్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులయ్యారు.

‘ఆచార్య’ అనంతరం వచ్చిన ‘గాడ్ ఫాదర్’ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అనంతరం పలు సినిమాలకు చిరు సైన్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ ‘చిరంజీవి’ నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబీ డైరెక్షన్ లో వస్తున్న మెగా 154 సినిమా టైటిల్ ‘వాల్తేర్ వీరయ్య’గా మేకర్స్ రిలీజ్ చేశారు. చాలా రోజుల తర్వాత ‘చిరంజీవి’ ఊర మాస్ గెటప్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ఇందులో మాస్ మహారాజ ‘రవితేజ’ కూడా నటిస్తున్నారు. వీరిద్దరినీ తెరపై చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కానుంది.