ప్రముఖ నటుడు నిర్మాత జివి నారాయణరావు భౌతికకాయనికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నారాయణరావు తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.నారాయణరావు లేరు అనే విషయాన్ని అంగీకరించడానికి చాలా కష్టంగా ఉందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పరిచయం 1977 నుంచి ఉందని, తాను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఆయన సీనియర్ స్టూడెంట్‌గా తమ క్లాస్‌లకు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. జి.వి. నారాయణరావు మృతికి చిరంజీవితో పాటు పలువురు ఇతర సినీ ప్రముఖులు కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
