Megastar Chiranjeevi: తేజ నా కలను నిజం చేశాడు.. అతను నా ప్రయాణంలో భాగమే: మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi: తేజ నా కలను నిజం చేశాడు.. అతను నా ప్రయాణంలో భాగమే: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja)పై ప్రశంసలు కురిపించారు. తేజ కూడా నా ప్రయాణంలో భాగమే అని, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తనని తాను ప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడని చెప్తూ ఆకాశానికి ఎత్తారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..     మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సౌత్ ఇండియా ఫెస్టివల్-2024 కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా..ఇన్నేళ్ల మీ కెరీర్ లో మీరు చేయాలనుకుని చేయలేకపోయినా సినిమా ఏది? అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు.. అని చిరంజీవిని ప్రశ్నించారుయాంకర్. 

దానికి సమాధానంగా చిరంజీవి మాట్లాడుతూ.. మీకు సమాధానం చెప్పే ముందు అక్కడ కూర్చున్న కుర్రాణ్ణి చూశారు కదా.. తేజ సజ్జ. ఇటీవల హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్ గా ఎదిగాడు. ఆ కుర్రాడు 25 ఏళ్ళ క్రితం నా సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు. అతనికి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం నన్ను అభిమానిస్తూ.. నా సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని హీరో అయ్యాడు. ఇప్పుడు హనుమాన్ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. 

నేను కూడా హనుమాన్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకున్నాను. కానీ, చేయలేకపోయాను. ఇప్పుడు హనుమాన్  సినిమా చేసి తేజ నా కలని  నిజం చేశారు. అందుకు నాకు సంతృప్తిగా ఉంది. ఎందుకంటే.. తేజ సజ్జ కూడా నా ప్రయాణంలో భాగమే... అంటూ తేజపై ప్రశంసలు కురిపించారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.