మెగా రివ్యూ వచ్చేసింది.. సినిమా సూపర్ హిట్ అంతే!

మెగా రివ్యూ వచ్చేసింది.. సినిమా సూపర్ హిట్ అంతే!

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen polishetty), స్టార్ బ్యూటీ అనుష్క(Anushka shetty) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr polishetty). అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. కొత్త దర్శకుడు మహేష్ బాబు(Mahesh babu) తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే సినిమా నుండి రిలీజైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక రిలీజ్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు మేకర్స్.

 ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాను చూశారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు సినిమా ఆయనకు బాగా నచ్చిందటూ మెగా రివ్యూ కూడా ఇచ్చేశారు. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేశారు చిరు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు మెగాస్టార్... మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూశాను. చాలా హిలేరియస్ గా ఉంది సినిమా. నేటి తరం యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం. 

హీరో నవీన్ పోలిశెట్టి హీరోయిన్ అనూష్క శెట్టిలు ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేశారు. అందుకు డైరెక్టర్ మహేష్ బాబును అభినందించాల్సిందే. ఈ సినిమాకు తొలి ప్రేక్షకుడ్ని నేనే. మరోసారి థియేటర్ లో ప్రేక్షకుల మధ్య చూడాలని ఉంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్, టీమ్, కాస్ట్ అండ్ క్రూ కి నా అభినందనలు ,శుభాకాంక్షలు.. అంటూ రాసుకొచ్చాడు మెగాస్టార్. ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ కూడా నవీన్ పోలిశెట్టికి ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.