‘మిషన్ ఇంపాజిబుల్’ ఓ మంచి సినిమా

‘మిషన్ ఇంపాజిబుల్’ ఓ మంచి సినిమా

ఇది చిన్న సినిమా కాదు: చిరంజీవి
తాప్సీ కీలక పాత్రలో స్వరూప్ ఆర్‌‌‌‌ఎస్‌‌జె తెరకెక్కించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. చైల్డ్ యాక్టర్స్‌‌ రోషన్‌‌, భాను ప్రకాష్‌‌, జై ప్రధాన పాత్రలు పోషించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌‌లో జరిగింది. చిరంజీవి ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘సినిమా చూశాను. చాలా బాగుంది.  బాలీవుడ్‌‌లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న తాప్సీ నటించిందని తెలిసి తన పాత్రపై ఎక్స్‌‌పెక్టేషన్‌‌తో చూశా. తమకు తెలియకుండా ఓ క్రైమ్‌‌లో ఇరుక్కున్న ముగ్గురు పిల్లలను తాప్సీ కాపాడుతుంది. పిల్లలు కూడా చాలా ఎంటర్‌‌‌‌టైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ సరదాగా, సెకెండాఫ్‌‌ ఇంటరెస్టింగ్‌‌గా ఉంది. ఇది చిన్న సినిమా కాదు.. అందరినీ ఆకట్టుకునే పెద్ద సినిమా’ అన్నారు. తాప్సీ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ముగ్గురు పిల్లలే హీరోలు. హిందీలో బిజీగా ఉండి కూడా తెలుగులో ఎందుకు నటిస్తున్నావ్ అని చాలామంది అడుగుతున్నారు. మనం ఎక్కడైతే స్టార్టవుతామో అది మనకి ఎప్పటికీ స్పెషల్. అందుకే నటించాను. ఎప్పటికీ నటిస్తూనే ఉంటాను’ అని చెప్పింది. టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.