Megastar Chiranjeevi: కని పెంచిన అమ్మకి ప్రేమతో..పుట్టినరోజు వేడుకలో మెగాస్టార్

Megastar Chiranjeevi: కని పెంచిన అమ్మకి ప్రేమతో..పుట్టినరోజు వేడుకలో మెగాస్టార్

మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనా దేవి(Anjana Devi) పుట్టినరోజు వేడుకను ఇవాళ (జనవరి 29) ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరు తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిరు పోస్ట్ చేస్తూ..ఫొటోస్ పంచుకున్నారు. ఈ వేడుకలో చిరంజీవి సోదరితో పాటు భార్య సురేఖ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం చిరుకి పద్మవిభూషణ్‌ పురస్కారం దక్కడంతో ఆయన ఇంట్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడీ జోష్‌లోనే తన కొత్త మూవీ ‘విశ్వంభర’ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తుంది.

ఇప్పటికే రెగ్యులర్‌షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ..చిరు ఇంకా సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మొదలు కానున్న కొత్త షెడ్యూల్‌తో చిరు సెట్స్‌లోకి రానున్నారని సమాచారం.