వీరయ్య విజయం కార్మికులది: చిరంజీవి

వీరయ్య విజయం కార్మికులది: చిరంజీవి

వాల్తేరు వీరయ్య విజయంతో తనకు మాటలు రావడం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నిన్న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైన విషయం తెలిసిందే. సినిమాకు హిట్ టాక్ రావడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తనకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని.. మనం మాట్లాడటం ఆపేసి ప్రేక్షకుల మాటలు విందామని చిరంజీవి అన్నారు. ప్రేక్షకుల ఉత్సాహమే మన ఇంధనం అని చెప్పారు. సినిమా యూనిట్ అంతా థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలి చిరు సూచించారు.

"ఈ సినిమా కోసం నేను కష్టపడలేదు, నా బాధ్యతగా అనుకుని పనిచేశాను. కష్టం నాది, రవితేజది కాదు. సినిమా బాగా రావాలని పని చేసిన వారిది. వాల్తేరు వీరయ్య సినిమాకు పని చేసిన కార్మికులది. మన మీద జాలితో కాదు.. సినిమాపై ప్రేమతో, కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి" అని చిరు చెప్పారు. విజయాలు వస్తుంటాయి పోతుంటాయి, కార్మికుల కష్టం అందరికీ తెలియాలన్నారు. కాగా ఈ కార్యక్రమంలో వాల్తేరు వీరయ్య సినిమాకు పని చేసిన కార్మికుల కోసం మేకర్స్ ఓ ప్రత్యేక వీడియో తయారీ చేయగా.. దానిని చిరు రిలీజ్ చేశారు.