Waltair Veerayya : అన్నా లీక్ చేయెద్దు.. సరే చెప్పను

Waltair Veerayya : అన్నా లీక్ చేయెద్దు.. సరే చెప్పను

వాల్తేరు వీరయ్య సినిమాకు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ప్రసంగించిన మెగాస్టార్ మొదటి 25 నిమిషాల్లోనే సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే రెండు ఎపిసోడ్స్ ఉంటాయంటూ లీకులిచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో కలగజేసుకున్న డైరెక్ట్ బాబీ వద్దన్నా అంటూ చిరును ఆపే ప్రయత్నం చేశారు. దీంతో తమాయించుకున్న మెగాస్టార్ ఒక మూడ్ లో పడిపోయి కథంతా చేప్పేస్తున్నానని, ఎక్కడ ఆపాలో తనకు తెలియదని అందుకే డైరెక్టర్ బాబీ తనను ఆపాలని సూచించారు. రంగస్థలం నుంచి చిరు లీక్స్ అలవాటైపోయిందని చిరు నవ్వులు పూయించారు. ఒక సినిమా తీస్తే ఎంత మిగిలింది అన్నట్లు కాకుండా ఎంత గొప్ప సినిమా తీశామన్న  ప్యాషన్ తో నిర్మాతలు సినిమాలు తీస్తున్నారని చెప్పారు.