Chiranjeevi : సెట్స్ నుంచి 'కాకా' వీడియో లీక్.. మెగాస్టార్ లుక్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్!

Chiranjeevi : సెట్స్ నుంచి 'కాకా' వీడియో లీక్.. మెగాస్టార్ లుక్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి అంటేనే స్టైల్, స్వాగ్, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. వయసు పెరుగుతున్నా ఆయనలోని జోష్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. లేటెస్ట్ గా ఆయన నటిస్తున్న 'కాకా' సినిమా నుంచి లీకైన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు మేకర్స్ రహస్యంగా ఉంచిన చిరంజీవి యంగ్ లుక్ బయటకు రావడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలో మెగాస్టార్‌ను చూసి 'ఎవరీ కొత్త హీరో?' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సిగార్‌తో మెగాస్టార్ స్టైలిష్ స్వాగ్..

బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాకా' సెట్స్ నుంచి ఈ వీడియో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 16 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌లో చిరంజీవి సిగార్ తాగుతూ, అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. నటుడు మురళీధర్ గౌడ్‌తో ఆయన మాట్లాడుతున్న సన్నివేశం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ లుక్‌ను చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించకపోవడంతో వీడియో వైరల్‌గా మారింది.

ముఖ్యంగా చిరంజీవి హెయిర్‌స్టైల్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే పాత మెగాస్టార్ రోజులు గుర్తుకొస్తున్నాయని అభిమానులు అంటున్నారు. కొందరైతే 'రౌడీ అల్లుడు' సినిమాలోని ఆటో జానీ లుక్‌ను గుర్తు చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ లుక్ సినిమాలోని ఏ సందర్భానికి సంబంధించినదనే విషయంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

 

'కదిరి కాళిదాస్'గా మెగా మ్యాజిక్..

ఈ సినిమాలో 'కదిరి కాళిదాస్' అనే పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే ఓ ఈవెంట్ లో  చిరంజీవి  ప్రకటించారు. ఈ పాత్రలో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, కబీర్ దుహాన్ సింగ్, అనురాగ్ కశ్యప్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తొలి తెలుగు చిత్రంగా 'కాకా' ప్రత్యేకతను సంతరించుకుంది.

సంక్రాంతికి కానుకగా 2027 జనవరి 13న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు లీక్ వీడియోపై చిత్రబృందం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. త్వరలో ఫస్ట్ సింగిల్‌పై ప్రకటన వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ యంగ్ లుక్‌తో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి..