మెగాస్టార్ షాకింగ్ డెసిషన్.. ఇకపై నో ఛాన్స్

మెగాస్టార్ షాకింగ్ డెసిషన్.. ఇకపై నో ఛాన్స్

రీసెంట్ గా రిలీజైన భోళా శంకర్(Bhola shankar) సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). నిజం చెప్పాలంటే ఈ సినిమాపై ఆడియన్స్ కు కాదు మెగా ఫ్యాన్స్ కు కూడా పెద్దగా అంచనాలు లేవు. కారణం ఇదొక రీమేక్ సినిమా కావడం. అది కూడా దాదాపు ఏడూ సంవత్సరాల క్రితం సినిమా. అందుకే ఈ సినిమాను చూడటానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. 

అంతేకాదు ఆయనతో పాటు ఉన్న సీనియర్ హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రల్లో స్ట్రెయిట్ ఫిలిమ్స్ చేస్తుంటే..సి చిరంజీవి ఎందుకు ఎలా రీమేక్స్ తీస్తున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ ఎఫెక్ట్ చిరుపై చాలానే పడింది. కొంతమందైతే ఈ రీమేక్ సినిమాలు తీయడం కంటే..సినిమాలు ఆపేయడం బెటర్ అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. 

దీంతో చిరు తన కెరీర్ లోనే షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. అదేంటంటే.. ఇకపై చేసే సినిమాలన్నీ స్ట్రెయిట్ సినిమాలే చేస్తారట. ఇక నుండి రీమేక్స్ కు నో ఛాన్స్ అంటున్నారట చిరంజీవి. ఆయన ప్రస్తుతం రెండు సినిమాలకు ఒకే చెప్పేశారు. అందులో ఆయన కూతురు సుష్మిత(Sushmitha)తో చేస్తన్న సినిమాగా కాగా.. యూవీ క్రియేషన్స్(UV Creations) లో చేస్తున్న సినిమా మరొకటి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇక రీమేక్స్ పట్ల చిరు తీసుకున్న డెసిషన్ తో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.