Mega Update: విశ్వంభర సెట్స్లో చిరంజీవి.. రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు!

Mega Update: విశ్వంభర సెట్స్లో చిరంజీవి.. రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టైటిల్ వీడియో ఆ అంచనాలను మరింత పెంచేసింది. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

Also read :- రాజకీయ పార్టీ పెట్టిన హీరో విజయ్ ఆస్తులు ఎంత..!

ఇక తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. ఫిబ్రవరి 2 నుండి విశ్వంభర సెట్స్ లో అడుగుపెట్టనున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే మొదలైన యాక్షన్ పార్ట్ షూట్ లో పాల్గొననున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫొటోలో మెగాస్టార్ షాడో ఇమేజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ పోస్టర్ కు వెన్ మిత్ కొల్లాయిడ్.. లెజెండ్స్ రైజ్.. అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కొత్త పోస్టర్ తో పాటు విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు మేకర్స్. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాను 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో చిరు సరసన మృణాల్ ఠాకూర్, అనుష్క, హనీ రోజ్ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.