Waltair veerayya: స్టెప్పులతో ఇరగదీసిన చిరు, రవితేజ

Waltair veerayya: స్టెప్పులతో ఇరగదీసిన చిరు, రవితేజ

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు.  రోజుకో అప్ డేట్ ఇస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ లు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్ గా మాస్ సాంగ్ వచ్చేస్తోందని.. మెగాస్టార్ × మాస్ మహారాజా = పూనకాలు లోడింగ్  సాంగ్ ను రిలీజ్ చేశారు.

 సంధ్య థియేటర్లో  లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. థియేటర్లకు అభిమానులు పెద్ద సంఖ్యలో అభిమానులు విచ్చేశారు. సంధ్య థియేటర్ కి దర్శకుడు బాబీతో పాటు చిత్రంలో నటించిన వారు విచ్చేశారు. అభిమానుల అరుపులు, కేకలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. ప్రకటించినట్లుగానే అభిమానుల సమక్షంలో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ వయస్సులో కూడా చిరు  స్టెప్పులతో అలరించారు.

మధ్యలో మాస్ మహరాజ్ రవితేజ వేసిన స్టెప్స్ అభిమానులను అలరించాయి. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడిండ్ అంటూ చిరు,  రవితేజ శృతి కలిపారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కినచిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా మాస్ మహరాజ రవితేజ కీలక పాత్ర పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.