పూనకాలు లోడింగ్‌ : ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ అదుర్స్

పూనకాలు లోడింగ్‌ : ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ అదుర్స్

చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీ  ‘వాల్తేరు వీరయ్య’ . సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను రిలీజ్ చేయనున్నారు. మూవీ ప్రమోషన్లో భాగంగా మేకర్స్ చిత్ర ట్రైలర్ ను రిలీజ్  చేశారు. 2 :51 సెకన్లు ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.  "మాస్ అనే పదానికి బొడ్డుకోసి పేరెట్టిందే ఆయనను చూసి' .. 'మీ కథలోకి నేను రాలా .. నా కథలోకే మీరంతా వచ్చారు' .. 'రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు .. నా పేరుమీదే రికార్డ్స్ ఉంటాయి" అనే డైలాగ్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. 

ఇందులో చిరంజీవి జాలరీ పాత్రలో కనిపిస్తుండగా, రవితేజ  పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. చిరు  సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కేథరిన్, బాబీ సింహా, నాజర్ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.