
రాఖీ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ కట్టించుకోవటమే కాదు. రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకి మాటివ్వాలి. నా సోదరసోదరీమణులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ లో చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు.
రాఖీ కట్టించుకోవటమే కాదు.రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు,
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 11, 2022
అక్క చెల్లెళ్లకి మాటివ్వాలి.
నా సోదరసోదరీమణులందరికి
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
Happy #rakhibandhan
రాఖీ పండగను పురస్కరించుకుని చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీ నుంచి ఓ వీడియోను వదిలారు. ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్..చిరుకు రాఖీ కడుతున్నట్టుగా ఉంది. కీర్తి సురేష్ తో రాఖీ కట్టించుకున్న అనంతరం..అక్కా చెల్లెల్లందరికి రక్షా బంధన శుభాకాంక్షలు..ప్రేమతో మీ సోదరుడు చిరంజీవి అంటూ చిరంజీవి చెప్పారు. అయితే ఇదే వీడియోను గతేడాది కూడా రిలీజ్ చేశారు. అందులో కీర్తి సురేష్ శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం.
ఆచార్య డిజాస్టర్ తో నిరుత్సాహంలో ఉన్న చిరంజీవి..ప్రస్తుతం గాడ్, మెగా 154 చిత్రాల్లో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ దసరాకు రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా..మెగా 154 సంక్రాంతికి విడుదల కావచ్చు. అయితే భోళా శంకర్ సినిమా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.