కేటీఆర్ కు చిరంజీవి బర్త్ డే విషెస్

కేటీఆర్ కు చిరంజీవి బర్త్ డే విషెస్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే డియర్ రామ్ అని వ్యాఖ్యానిస్తూ.. ఓ ఫొటోను షేర్ చేస్తూ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. తమ ప్రియతమ నేతను విష్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద వరద బాధితులకు సహాయం చేయాలని కోరారు.