Megastar Chiranjeevi: మెగాస్టార్ పుట్టినరోజున కొత్త సినిమా అప్డేట్!..డైరెక్టర్ ఎవరంటే?

Megastar Chiranjeevi: మెగాస్టార్ పుట్టినరోజున కొత్త సినిమా అప్డేట్!..డైరెక్టర్ ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. చిరంజీవి నటించే కొత్త మూవీని త్వరలో ప్రకటించబోతున్నారు. ఎన్నో హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్, డైలాగ్ రైటర్ గా పనిచేసిన బి.వి.ఎస్ రవి (BVS Ravi) రెడీ చేసిన స్టోరీలో చిరు నటించబోతున్నట్లు సమాచారం. బి.వి.ఎస్ రవి చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మెగా డాటర్ సుస్మిత కొణెదల హౌస్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు టాక్

అయితే ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..తమిళ స్టార్ డైరెక్టర్ గాడ్ ఫాదర్' ఫేమ్ మోహన్‌రాజా దర్శకత్వంలో చిరు ఈ ప్రాజెక్టును చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని..ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారని సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ నెల (ఆగస్ట్ 22న) చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది.

అయితే, గతంలో డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) సైతం చిరుతో సినిమా చేయనున్నట్లు టాక్ ఉంది. మరే ఏ కథను ఎవరు డైరెక్ట్ చేయనున్నారో తెలియాల్సి ఉంది. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’తో సెట్స్‌లో గడుపుతున్న సంగతి తెలిసిందే. బింబిసార ఫేమ్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.