సూపర్ స్పీడ్తో మెగాస్టార్

సూపర్  స్పీడ్తో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌‌లో పాల్గొంటూ సూపర్ స్పీడ్‌‌తో దూసుకుపోతున్నారు. రీసెంట్‌‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షూటింగ్ మొదలుపెట్టగా అప్పుడే ఫస్ట్  షెడ్యూల్‌‌ను పూర్తి చేసేశారు. హైదరాబాద్‌‌లో వేసిన స్పెషల్ సెట్‌‌లో ఈ షెడ్యూల్‌‌ జరిగింది. చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను  చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్‌‌ కూడా ఈ వారంలోనే మొదలుకానుందని తెలుస్తోంది. ఈ స్పీడ్ చూస్తుంటే అనుకున్న దానికంటే ముందే దర్శకుడు అనిల్ ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసేలా ఉన్నాడని చిరు అభిమానులు అంటున్నారు. 

 చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా ఇది.  ఇందులో ఆయన వింటేజ్ లుక్‌‌లో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్‌‌గా నటిస్తోంది.   షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల  నిర్మిస్తున్న ఈ  చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.