‘వాల్తేరు వీరయ్య’ నుంచి చిరు కొత్త పోస్టర్‌‌‌‌

‘వాల్తేరు వీరయ్య’ నుంచి చిరు కొత్త పోస్టర్‌‌‌‌

‘పూనకాలు లోడింగ్’ అనే క్యాప్షన్‌‌తో.. ‘వాల్తేరు వీరయ్య’ మూవీ అనౌన్స్‌‌మెంట్ దగ్గర్నుంచీ మెగా ఫ్యాన్స్‌‌లో ఆసక్తిని పెంచాడు దర్శకుడు బాబీ. దానికి తగ్గట్టుగానే చిరంజీవి పోస్టర్స్‌‌తో మరింత హైప్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు లుంగీ పైకి కట్టి పక్కా మాస్ అవతార్‌‌‌‌లో కనిపించిన చిరు.. కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో స్టైలిష్ లుక్‌‌లో మెస్మరైజ్ చేస్తున్నారు. ఆల్రెడీ టీజర్, పాటలతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ శుక్రవారం నుంచి అవుట్ డోర్ ప్రమోషన్లకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లకు స్టాండీలను పంపించేందుకు ప్లాన్ చేశారు.

దీనికోసం చిరంజీవి కొత్త పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. పోలీసు స్టేషన్‌‌లో ఒక భారీ యాక్షన్ సీన్ నుండి ఈ స్టిల్‌‌ని రిలీజ్ చేసినట్టు అర్ధమవుతోంది. చేతికి సంకెళ్లతో బ్యాగ్రౌండ్‌‌లో తుపాకీలతో గంభీరంగా కూర్చున్న వీరయ్య... వేటకు రెడీ అన్నట్టుగా ఉందీ స్టిల్. ఇప్పటికే  సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఇటీవల రెండు పాటల కోసం యూరప్ వెళ్లిన చిరంజీవి, శ్రుతిహాసన్ ఓ పాటను కంప్లీట్ చేయగా, మరో సాంగ్‌‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదల కానుంది.