Chiranjeevi : 'విశ్వంభర' రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా బరిలో మెగాస్టార్ విశ్వరూపం!

Chiranjeevi : 'విశ్వంభర' రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా బరిలో మెగాస్టార్ విశ్వరూపం!

మెగాఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. గత కొంతకాలంగా  వాయిదా పడుతూ వస్తున్న  మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' విడుదలకు సిద్ధం అవుతుంది.  రిలీజ్ పై  నడుస్తున్న సస్పెన్ష్ కు ఎండ్ కార్డు పలకనుంది. ఈ సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీ అక్టోబర్ 16, 2026న దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 'ది వెయిట్ ఈజ్ ఓవర్' అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్అప్పుడే పండగ చేసుకోవడం మొదలుపెట్టారు.

జగదేకవీరుడి రేంజ్ లో..

గతంలో చిరంజీవి కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'అంజి' చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న పూర్తి స్థాయి సోషియో-ఫాంటసీ చిత్రం ఇదే . 'బింబిసార'తో టాలీవుడ్‌ను మెప్పించిన యంగ్ డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, ప్రేక్షకులకు హాలీవుడ్ రేంజ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే పట్టుదలతో విజువల్ ఎఫెక్ట్స్ (VFX), భారీ గ్రాఫిక్స్ పనులపై చిత్రయూనిట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 

 క్రేజీ కాంబినేషన్స్!

ఈ మెగా ప్రాజెక్టులో చిరు సరసన గ్లామరస్ క్వీన్ త్రిష నటిస్తుండగా, పవర్‌ఫుల్ విలన్‌గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ రౌద్రం చూపించబోతున్నారు. వీరితో పాటు ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, ఆశ్రిత వేముగంటి నండూరి వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో మెరవనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ ఫీస్ట్‌ను నిర్మిస్తోంది.

►ALSO READ | Vijaya Mehta: రంగస్థల దిగ్గజ దర్శకురాలు కన్నుమూత.. ‘ఆమె కళ తరాలకు స్ఫూర్తి’ మోడీ ట్వీట్

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండడం మరో పెద్ద ఫ్లస్ కానుంది. .దసరా బరిలోకి దిగేందుకు రెడీ అయింది. మెగాస్టార్ ‘విశ్వరూపానికి' బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఈ దసరాకు థియేటర్లు మెగా జాతరను తలపించబోతున్నాయి.